K Kavitha: కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూతురు కవిత ట్వీట్

MLC Kavitha tweet after father discharged from the hospital today
  • దేశం నలుమూలల నుంచి కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు చూపిన వారికి కవిత కృతజ్ఞతలు 
  • ఆపరేషన్ తర్వాత తన తండ్రి ఈరోజే డిశ్చార్జ్ అయ్యారని ట్వీట్ ద్వారా వెల్లడి
  • సహకరించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన కవిత
క్లిష్ట పరిస్థితుల్లో దేశం నలుమూలల నుంచి తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబరిచిన వారందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ ఇటీవల కాలు జారి కిందపడటంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది, ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె ట్వీట్ చేశారు. 'ఆపరేషన్ విజయవంతమైన తర్వాత ఈ రోజు నాన్న (కేసీఆర్) డిశ్చార్జ్ అయ్యారు. అన్ని విధాలుగా సహకరించిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశం నలుమూలల నుంచి మాకు లభించిన ఆప్యాయత, ప్రేమకు వారందరికీ కృతజ్ఞతలు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
K Kavitha
KCR
Telangana

More Telugu News