Jagan: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి సంతాపం తెలిపిన జగన్, చంద్రబాబు, లోకేశ్

Jagan Chandrababu Nara Lokesh condolences to Shaikh Sabji death
  • రోడ్డు ప్రమాదంలో షేక్ సాబ్జీ దుర్మరణం
  • రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన ఏపీ కేబినెట్
  • ప్రజల గొంతు మూగబోయిందన్న లోకేశ్
ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సాబ్జీ మరణ వార్తను తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

సాబ్జీ కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చివరి ఘడియల్లో కూడా సాబ్జీ ప్రజాసేవలోనే కొనియాడారని చెప్పారు. షేక్ సాబ్జీ మృతి చెందారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని లోకేశ్ తెలిపారు. శాసనమండలిలో వినిపించే ప్రజల గొతు మూగబోయిందని చెప్పారు. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు సాబ్జీకి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ఎక్స్ వేదికగా స్పందించారు.
Jagan
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam
Shaikh Sabji

More Telugu News