Jeevan Reddy: జిల్లాల కుదింపు ఉండదు..వాటితో ప్రజలకు ప్రయోజనం ఉంది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

  • కొత్త జిల్లాలతో ఆయా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వచ్చాయన్న జీవన్ రెడ్డి
  • ప్రజలకు కావాల్సింది ఇలాంటి అభివృద్ధేనని వ్యాఖ్య
  • కరీంనగర్‌లో హుస్నాబాద్‌ విలీనం తప్పదని స్పష్టీకరణ
Jeevan reddy talks about district reintegration

బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను కుదించడం ఉండదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వాటితో ప్రజలకు కొంత ప్రయోజనం చేకూరిందన్నారు. గురువారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వచ్చాయని, అటువంటి అభివృద్ధి వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాల్సిందేనని, రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ విషయమై తాను అక్కడి ప్రజలకు హామీ ఇచ్చానని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం సిద్దిపేట జిల్లాలో కలిపిన హుస్నాబాద్‌ను మునుపటిలా కరీంనగర్‌కు మార్చుతామని స్పష్టం చేశారు.

More Telugu News