దక్షిణాఫ్రికాతో చివరి టీ20లో టాస్ ఓడిన టీమిండియా... ఈ మ్యాచ్ గెలిస్తేనే...!
- దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ20ల సిరీస్
- తొలి మ్యాచ్ వర్షార్పణం... రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలుపు
- నేటి మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సఫారీల వశం
- సిరీస్ సమం చేయాలని దృఢనిశ్చయంతో ఉన్న టీమిండియా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
ఈ మ్యాచ్ కు జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవు.
ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టులో పలు మార్పులు జరిగాయి. సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ పునరాగమనం చేశాడు. ట్రిస్టాన్ స్టబ్స్ స్థానంలో డోనోవాన్ ఫెరీరాకు అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్ ద్వారా నాండ్రే బర్గర్ అరంగేట్రం చేస్తున్నాడని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ వెల్లడించాడు.