Amrapali: హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Amrapali is Joint Metropolitan Commissioner of HMDA
  • కొందరి బదిలీ.. మరికొందరికి అదనపు బాధ్యతలు
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ నియామకం
  • వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు భార్య
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అధికారులను బదిలీ చేసింది... మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్‌ను నియమించింది. ఇంధన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీనిను నియమించింది.

ట్రాన్స్‌కో, జెన్‌కోగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం... మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జ్ ఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసింది.

మంత్రి శ్రీధర్ బాబు భార్య, ఐఏఎస్ శైలజా రామయ్యర్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ట్రాన్స్ కో ఎండీగా సందీప్ కుమార్ ఝా, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కమ్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ బి.గోపికి బాధ్యతలు అప్పగించారు.
Amrapali
Telangana
Congress

More Telugu News