Unstoppable With NBK: బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ షో' లిమిటెడ్ ఎడిషన్ లో గెస్టులు వీరే!

Balakrishna Unstoppable Talk Show latest episode promo out now
  • బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో
  • ఇప్పటివరకు రెండు సీజన్లు విజయవంతం
  • ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్ ఎపిసోడ్ల ప్రసారం
  • తాజా ఎపిసోడ్ నూ రక్తికట్టించిన బాలయ్య
  • ప్రోమో విడుదల చేసిన ఆహా ఓటీటీ
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్  గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటివరకు రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్ ఎపిసోడ్లతో అన్ స్టాపబుల్ షో సందడి చేస్తోంది. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ ప్రోమో వీడియోను ఆహా ఓటీటీ పంచుకుంది. 

ఈసారి అన్ స్టాపబుల్ షోకు అలనాటి ప్రముఖ హీరోయిన్ సుహాసిని, సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నటి శ్రియ, దర్శకుడు హరీశ్ శంకర్ విచ్చేశారు. వారితో బాలయ్య ఎలాంటి సందడి చేశారన్నది ప్రోమోలో శాంపిల్ చూపించారు. 

ముఖ్యంగా, నాడు 'మంగమ్మగారి మనవడు' చిత్రంలో సూపర్ హిట్టయిన సాంగ్ 'దంచవే మేనత్త కూతురా' అనే పాటకు వేదికపై బాలకృష్ణ, సుహాసిని డ్యాన్స్ చేశారు. ఇక, బాలయ్య, హరీశ్ శంకర్ మధ్య మాటల చమక్కులు చోటుచేసుకున్నాయి.
Unstoppable With NBK
Balakrishna
Aha OTT
Suhasini
Harish Shankar
Jayant C Paranjee
Shriya Saran

More Telugu News