Seethakka: అంగన్వాడీలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్

Minister Seethakka good news to Anganwadies
  • తన ఛాంబర్‌లో వేదమంత్రోచ్చారణల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క
  • మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందిన ఫైలుపై సంతకం
  • అంగన్వాడీ టీచర్ల వేతనాల పెంపు ఫైలుపై సంతకం
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు శుభవార్త చెప్పారు. తెలంగాణ సచివాలయంలో తన ఛాంబర్‌లో వేదమంత్రోచ్చారణల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందిన ఫైలుపై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు... ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. ఇదిలా ఉండగా, అంగన్వాడీ టీచర్లకు మంత్రి తీపి కబురు చెప్పారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్ మీద కూడా సంతకం చేశారు. దీంతో ఇప్పటివరకు రూ.7,500 వేతనం ఇక నుంచి రూ.13,500కు పెరగనుంది. మొదటి సంతకంతోనే మంత్రి సీతక్క తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Seethakka
Telangana
anganwadi
Congress

More Telugu News