Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే...!

  • ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • ఒకే నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్
  • మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు
  • మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పరీక్షలు
Botsa says govt will conduct Inter and Tenth class exams in March

సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్చి నెలలోనే ఇంటర్, టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు... మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరుపుతామని వెల్లడించారు. ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల షెడ్యూల్ రూపొందించామని బొత్స చెప్పారు. 

ఈసారి పదో తరగతి పరీక్షలకు 6 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలు రాయనున్నారని వివరించారు. ఇంటర్మీడియట్ కు సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఉంటాయని మంత్రి బొత్స వెల్లడించారు.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్...


పదో తరగతి పరీక్షల షెడ్యూల్...

More Telugu News