Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ స్థిరంగా ఉంచడంతో మార్కెట్లలో జోష్
  • 930 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 256 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ స్థిరంగా ఉంచడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 930 పాయింట్లు లాభపడి 70,514కి ఎగబాకింది. నిఫ్టీ 256 పాయింట్లు పుంజుకుని 21,183కి చేరుకుంది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (3.91%), ఇన్ఫోసిస్ (3.61%), విప్రో (3.52%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.97%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.01%), నెస్లే ఇండియా (-1.04%), టైటాన్ (-0.32%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.29%), మారుతి (-0.29%).

More Telugu News