అధికారిక నివాసం ప్రజాభవన్‌లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన భట్టి కుటుంబం
- పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు
- సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం
కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది. అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయించింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు.