తొలిరోజే కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ సీఎం
- లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిన మోహన్ యాదవ్
- నియంత్రణ లేని లౌడ్ స్పీకర్లపై నిషేధం
- ఈరోజు మోదీ, అమిత్ షా సమక్షంలో మోహన్ ప్రమాణస్వీకారం
ప్రధాని మోదీ సమక్షంలో ఈరోజు సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు హాజరయ్యారు.