Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి?: అధికారులకు రేవంత్ రెడ్డి ప్రశ్న

Revanth Reddy review on Dharani
Advertisement
  • సమీక్షలో పాల్గొన్న మల్లు భట్టి, శ్రీనివాస్ రెడ్డి, దామోదర
  • ధరణిపై నవీన్ మిట్టల్ ప్రజెంటేషన్
  • ధరణిపై పూర్తి వివరాలు అందించాలని రేవంత్ రెడ్డి ఆదేశం
Advertisement
ధరణి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సచివాలయంలో అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు. ధరణిపై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ... భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకు రావడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.83 కోట్లు ఇచ్చిందని, ఆ నిధులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ భూముల వివరాలతో పాటు మంత్రులు లేవనెత్తిన అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Advertisement
Advertisement
Revanth Reddy
Telangana
dharani
Narendra Modi

More Telugu News