Guntur Kaaram: ‘గుంటూరు కారం’ నుంచి ‘ఓ మై బేబీ’ లిరికల్ సాంగ్

  • మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం'
  • సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ 
  • తాజాగా 'ఓ మై బేబీ' లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన మేకర్స్
  • ఈ మెలొడీకి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్
Gutur karam oh my baby melody released

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి కథానాయికలు. సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రచారంలో భాగంగా మూవీ మేకర్స్ ఇటీవల విడుదల చేసిన దమ్ మసాలా సాంగ్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా రెండో పాట కింద ఓ లిరికల్ మెలోడీ సాంగ్ విడుదల చేశారు. ఓ మైబేబీ అంటూ సాగే ఈ పాట కూడా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ సాంగ్‌కు లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ మ్యూజిక్ అందించాడు. వచ్చే ఏడాది జనవరి 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News