Seethakka: అంత తొందరపాటు పనికి రాదు: కేటీఆర్‌పై మంత్రి సీతక్క విమర్శలు

Minister Seethakka satires on BRS working president KTR
  • బీఆర్ఎస్ నాయకులను అధికారం పోయిందన్న బాధ వెంటాడుతోందన్న సీతక్క
  • ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడి
  • రైతులకు ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటామన్న సీతక్క
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను అధికారం పోయిందన్న బాధ వెంటాడుతోందని మంత్రి సీతక్క బుధవారం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలకులకు ఇప్పుడు అసలు ఆట ఉందని, అలవిగాని హామీలు ఇచ్చారంటూ అంతకుముందు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకులకు అంత తొందరపాటు పనికి రాదన్నారు. అధికారం పోయిందన్న బాధ వారిలో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

ఎన్నికల ప్రచారం సమయంలో తాము ఇచ్చిన హామీలకు.. బీఆర్ఎస్ మరిన్ని జోడించి చెప్పిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు వారు ఎలా ప్రశ్నిస్తున్నారని, ఇచ్చిన ప్రతి హామీని తాము నెరవేరుస్తామని వ్యాఖ్యానించారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాటను కచ్చితంగా నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ గెలిచిందని ప్రజలంతా సంతోషపడుతున్నారని చెప్పారు.
Seethakka
KTR
BRS
Congress

More Telugu News