Revanth Reddy: సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డికి సినీ దర్శకుడు సంజీవ్ రెడ్డి లేఖ

  • వర్షాల వల్ల నిండే రోడ్లు, పొంగే నాలాల సమస్యలను కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి
  • వీఐపీలకు లేదా ప్రజాప్రతినిధులకు ట్రాఫిక్ క్లియర్ చేసినట్లుగా అంబులెన్సులకు కూడా చేయాలన్న సంజీవ్ రెడ్డి
  • కూడలిలలో తాగినంత పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలన్న సంజీవ్ రెడ్డి
  • కూడళ్ల వద్ద పరిశుభ్రమైన టాయిలెట్లను నిర్మించాలని విజ్ఞప్తి 
Sanjeev Reddy tweet on various issues to Revanth Reddy and Komatireddy

 సినీ యువ దర్శకుడు సంజీవ్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు బహిరంగ లేఖ రాశారు. సినీ, ప్రజా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి.. అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజ్ తరుణ్‌తో అహ నా పెళ్లంట అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.  

సమస్యలను వెల్లడించడానికి ముందు... గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. వర్షాల వల్ల నిండే రోడ్లు, పొంగే నాలాల సమస్యలను కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వీఐపీలకు లేదా ప్రజాప్రతినిధులకు ట్రాఫిక్ క్లియర్ చేసినట్లుగా అంబులెన్సులకు కూడా చేయాలని లేదా వెహికిల్ ప్రింప్షన్‌ను సరిగ్గా  వినియోగించుకునేలా చూడాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పిల్లలతో బిక్షాటన చేయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. అలాగే కూడలిలలో తాగినంత పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలని, అలాగే పరిశుభ్రమైన టాయిలెట్లను నిర్మించాలన్నారు. రోడ్డు మీద యూటర్న్‌ల దూరాన్ని తగ్గించాలని, పార్కింగ్ ప్రాంతాలను పెంచాలని కోరారు. ఈ మేరకు మొదటి పేజీలో ప్రజా సమస్యలను ప్రస్తావించి ఇట్లు మీ హైదరాబాద్ వాసి అని పేర్కొన్నారు.

ఆ తర్వాత సినిమా పరిశ్రమ సమస్యలను ఏకరవు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి గారికి.. అంటూ మరో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమా అవార్డులు, ఫిల్మ్ ఫెస్టివెల్స్ ప్రారంభించాలని కోరారు. ప్రత్యేక సినిమా స్కూల్స్ ప్రారంభించాలని, మణికొండ, కృష్ణానగర్ ప్రాంతాల్లో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియంలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ సినిమాలకు, చిన్న సినిమాలకు, పిల్లల సినిమాలకు ప్రభుత్వ సబ్సిడి, పన్ను ప్రోత్సాహకులు ఇవ్వాలని, అర్హులైన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, పాత్రికేయులకు ఇల్లు లేదా స్థలాలు ఇచ్చి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి మరియు చైతన్యవంతమైన సృజనాత్మక వాతావరణానికి దోహదపడాలని కోరారు.

More Telugu News