Stock Market: స్టాక్ మార్కెట్లకు అమ్మకాల సెగ

  • 377 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతం వరకు నష్టపోయిన సన్ ఫార్మా షేరు విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ... కాసేపట్లోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంలో నష్టాల్లోకి జారుకున్నాయి. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 377 పాయింట్లు నష్టపోయి 69,551కి పడిపోయింది. నిఫ్టీ 90 పాయింట్లు కోల్పోయి 20,906కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (1.87%), యాక్సిస్ బ్యాంక్ (1.28%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.07%), టీసీఎస్ (0.82%), విప్రో (0.43%). 

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.90%), మారుతి (-1.87%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.71%), టైటాన్ (-1.71%), రిలయన్స్ (-1.43%).

More Telugu News