Omar Abdullah: భార్యతో విడాకులు మంజూరు చేయాలని ఒమర్ అబ్దుల్లా పిటిషన్.. హైకోర్టు కీలక తీర్పు

Omar Abdullah petition seeking divorce from wife dismissed by Delhi high court
  • సచిన్ పైలట్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్న ఒమర్ అబ్దుల్లా
  • ఇప్పటికే విడివిడిగా ఉంటున్న భార్యాభర్తలు
  • విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. విడాకుల పిటిషన్ ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం మంచిదేనని హైకోర్టు అభిప్రాయపడింది. తన భార్య క్రూరత్వంపై ఒమర్ అబ్దుల్లా ఆరోపణలు స్పష్టంగా లేవని చెప్పింది. ఆయన ఆరోపణలకు సరైన ఆధారాలు కూడా లేవని వ్యాఖ్యానించింది. కింది కోర్టు తీర్పుపై వేసిన అప్పీల్ పిటిషన్ లో ఎలాంటి మెరిట్స్ లేవని తెలిపింది. ఒమర్ అబ్దుల్లా పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నామని జస్టిస్ సచ్ దేవ, జస్టిస్ వికాస్ మహాజన్ లతో కూడిన ధర్మాసనం చెప్పింది. ఒమర్ అబ్దుల్లా భార్య పాయల్ రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ చెల్లెలు కావడం గమనార్హం. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
Omar Abdullah
Divorce
Delhi High Court

More Telugu News