Congress: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కార్డు పేరుతో దళారుల దోపిడీ

cheating with congress six guarentees
  • ఆకర్షణీయంగా కాంగ్రెస్ పార్టీల ఆరు గ్యారెంటీల పథకం
  • 6జీ కార్డు అంటూ ప్రజలను మోసం చేస్తున్న దళారులు
  • ఒక్కో కార్డు రూ.300కు విక్రయం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకాన్ని, అలాగే ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రూ.5 లక్షల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. ఈ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని పలువురు దళారులు... ఉపయోగించుకొని, అమాయకులను మోసం చేస్తున్నారు. 6జీ కార్డు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలకు ఒక్కో కార్డును రూ.300కు అమ్ముతున్నారు. దీనిని గుర్తించిన కాంగ్రెస్ నేతలు 6జీ కార్డు అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Congress
Telangana

More Telugu News