Chandrababu: ఈరోజు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరుకు వెళ్తున్న చంద్రబాబు

Chandrababu going to Sriperumbudur
  • ఆలయాలను దర్శించుకుంటున్న చంద్రబాబు
  • శ్రీపెరుంబుదూరులోని శ్రీరామానుజర్ ఆలయంలో పూజలు నిర్వహించనున్న బాబు
  • రాత్రికి విజయవాడకు చేరుకోనున్న టీడీపీ అధినేత
టీడీపీ అధినేత చంద్రబాబు ఆలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ఆయన తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూరుకు వెళ్తున్నారు. అక్కడ ఉన్న శ్రీరామానుజర్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చెన్నై నగర టీడీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. 

ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయల్దేరి చెన్నైకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీపెరుంబుదూరుకు వెళ్తారు. దర్శనం అనంతరం చెన్నై చేరుకుంటారు. అనంతరం 8.50 గంటలకు విజయవాడకు విమానంలో బయల్దేరుతారని చంద్రశేఖర్ వెల్లడించారు.
Chandrababu
Telugudesam
Tamil Nadu
Sriperumbudur

More Telugu News