AP Unemployment Rate: ఏపీలో నిరుద్యోగిత దేశంలోనే అధికం.. ఇవిగో ఆధారాలు: నారా లోకేశ్

Andhra Pradesh has THE HIGHEST UNEMPLOYMENT RATE in the country says Nara Lokesh
  • ఏపీలోని నిరుద్యోగిత రేటు 24 శాతమన్న లోకేశ్
  • ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని ఆగ్రహం
  • యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన
దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన రాష్ట్రాన్ని వైఎస్ జగన్ నాశనం చేశారని, అట్టడుగుకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉద్యోగాల్లేక యువత నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి అభివృద్ధి సాధించే అర్హత ఉందని, యువత వృద్ధిలోకి వస్తారని పేర్కొన్నారు. ఏపీలో నిరుద్యోగిత రేటుపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపుతూ ఓ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం క్లిప్పింగు‌ను లోకేశ్ జతచేశారు.

AP Unemployment Rate
Andhra Pradesh
Nara Lokesh

More Telugu News