Seethakka: మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అధికారులతో తొలిసారి సమావేశమైన సీతక్క.. వీడియో ఇదిగో

Sitakka held the first meeting with the officials after taking charge as a minister
  • ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశాలు నిర్వహించిన మంత్రి
  • మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి గిరిజన శాఖ అధికారులతో కూడా భేటీ
  • ఎక్స్ వేదికగా సమావేశాల వీడియోను పంచుకున్న సీతక్క
తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి సీతక్క. నక్సల్స్ ఉద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి, ఆ తర్వాత విద్య, అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన తీరు ఆమెని ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆమె మరోసారి విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. మంత్రిగా ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారి ప్రభుత్వాధికారులతో సోమవారం కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. 

పంచాయతీరాజ్- గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశాలు నిర్వహించారు. మేడారం జాతర ఏర్పాట్లకు సంబంధించి గిరిజన శాఖతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేశారు. సమావేశానికి విచ్చేసిన మంత్రి సీతక్కను అధికారులు సాదరంగా ఆహ్వానించడం వీడియోలో కనిపించింది. పుష్పగుచ్ఛాలు ఇచ్చి పరిచయం చేసుకున్నారు.
Seethakka
Minister Sethakka
Congress
Telangana

More Telugu News