Top Google Searches: ఈ ఏడాది గూగుల్‌లో భారతీయులు ఎక్కువగా వెతికినవి ఇవే!

  • 2023 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌పై నివేదిక విడుదల
  • భారత్‌లో చంద్రయాన్-3 గురించి నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేశారన్న గూగుల్ 
  • ఆ తరువాతి స్థానాల్లో కర్ణాటక ఎన్నికలు, ఇజ్రాయెల్ వార్తలు
Heres What India Googled In 2023

ఈ ఏడాది ముగింపునకు వచ్చేసింది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏడాది కాలంగా జరిగిన అనేక విషయాలపై సమీక్షలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గూగుల్ తాజాగా ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌పై నివేదిక విడుదల చేసింది. ఇండియాతో పాటూ ప్రపంచవ్యాప్తంగా జనాలు గూగుల్‌లో ఏ అంశాలను వెతికారో వెల్లడించింది. గూగుల్ వివరాల ప్రకారం గూగుల్‌ ఇండియా సెర్చ్ ఫలితాల్లో చంద్రయాన్-3 తొలి స్థానంలో నిలిచింది. 
భారత్‌లో జనాలు గూగుల్‌లో అత్యధికంగా వెతికిన అంశాలు:

  • చంద్రయాన్-3
  • కర్ణాటక ఎన్నికల ఫలితాలు
  • ఇజ్రాయెల్ వార్తలు
  • సతీశ్ కౌశిక్
  • బడ్జెట్ 2023
  • తుర్కియే భూకంపం
  • ఆతిక్ అహ్మద్
  • మాథ్యూ పెర్రీ (అమెరికన్ టీవీ నటుడు)
  • మణిపూర్ న్యూస్
  • ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్
ఇక ప్రశ్నల పరంగా చూస్తే.. జీ20 అంటే ఏంటి? యూసీసీ అంటే ఏంటి? చాట్‌జపీటీ అంటే ఏంటి? అనేవి అత్యధికులు అడిగిన ప్రశ్నలుగా నిలిచాయి.

More Telugu News