Vijayashanti: 5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టి వెళ్లారు.. బీఆర్‌ఎస్‌పై విజయశాంతి మండిపాటు

  • సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌పై విజయశాంతి విమర్శలు
  • 10 సంవత్సరాల్లో ఖజానా ఖాళీ చేశారని ఆగ్రహం
  • ప్రతి పక్షం ఓటమిని భరించలేకపోతోందని వ్యాఖ్య
Vijayashanti lashes out at brs

బీఆర్ఎస్‌పై విజయశాంతి మరోసారి మండిపడ్డారు. గత 10 ఏళ్లల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఖజానాను కొల్లగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 లక్షల కోట్ల అప్పు ప్రజల నెత్తిన పెట్టి వెళ్లిందని ఫైరైపోయారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె నిప్పులు చెరిగారు. ప్రతిపక్షం ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక పోతోందని, అందుకే కాంగ్రెస్ గద్దెనెక్కిన మూడు రోజులకే ఇచ్చిన 100 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోందని విమర్శించారు. 

‘‘సుమారు 10 సంవత్సరాల తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకు బాధ్యులైన నాటి బీఆర్ఎస్ మంత్రులు మూడు దినాలల్లనే నూతన సర్కారు అన్ని హామీలను అమలు చేయాలని ప్రశ్నించడం ప్రతిపక్షంగా అన్ని తెలిసి చేస్తున్న మోసపు ప్రకటనలు ప్రయత్నం, ఓటమి తట్టుకోలేని వ్యక్తుల వివాదం..
విజ్ఞత, బాధ్యతాయుత ధోరణితో ఉండే గత ఆర్థిక మంత్రి @BRSHarish రావు గారితో కూడా ఇట్ల ఎందుకు మాట్లాడిస్తున్నరో దవాఖానలో ఉన్న కేసీఆర్ గారు ... తెల్వదు..
ఐనా, మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదు అన్నది వాస్తవం... అందుకై మన ముఖ్యమంత్రి శ్రీ 
@revanth_anumula గారిని, ప్రభుత్వాన్ని విమర్శించే శక్తులను సమర్ధవంతంగా తిప్పికొట్టి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యాచరణను నిరంతరం ప్రజలకు చేర్చవలసిన బాధ్యత ఈ సందర్బంగా తెలంగాణల బీఆర్ఎస్ నియంతృత్వ గడిలనుండి విముక్తికై కొట్లాడి నేటి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకై పనిచేసిన మన వంటి తెలంగాణ ప్రజాస్వామ్యవాదులుపై ప్రస్తుతం తప్పక  ఉన్నది’’ అని విజయశాంతి ఎక్స్ వేదికగా విమర్శలు సంధించారు.

More Telugu News