Stock Market: చరిత్ర సృష్టించి తగ్గిన సెన్సెక్స్

  • తొలిసారి 70 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్
  • చివరకు 103 పాయింట్ల లాభంతో 69,929 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 28 వేల పాయింట్లు పెరిగి 20,997 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
Sensex crosses 70000 mark first time in history

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డును సృష్టించాయి. చరిత్రలోనే తొలిసారి సెన్సెక్స్ 70 వేల మార్కును అధిగమించింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో ఈరోజు ఉదయం మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 70,083 పాయింట్లకు పెరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 69,929కి చేరుకుంది. నిఫ్టీ 28 పాయింట్లు పుంజుకుని 20,997 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.04%), నెస్లే ఇండియా (1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.05%), టాటా మోటార్స్ (0.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.82%). 

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-1.26%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.99%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.67%), మారుతి (-0.59%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.43%).

More Telugu News