Brinda Master: 'కన్నప్ప' షూటింగ్ లో అపశ్రుతి... గాయపడిన బృందా మాస్టర్

  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం
  • న్యూజిలాండ్ లో చిత్రీకరణ
  • బృందా మాస్టర్ కాలు విరగడంతో నిలిచిన పాట చిత్రీకరణ 
Brinda master injured in Kannappa shooting

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రం షూటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటుండగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ గాయపడ్డారు. ఆమె కాలికి గాయం కావడంతో పాట చిత్రీకరణను నిలిపివేశారు. బృందా మాస్టర్ కాలు విరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం జరిగింది. 

కాగా, కన్నప్ప చిత్రంలో మంచు విష్ణుతో పాటు నయనతార, ప్రభాస్, మోహన్ లాల్,  మోహన్ బాబు, శరత్ కుమార్, శివరాజ్ కుమార్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రానికి మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్ర నిర్మాణంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.

More Telugu News