Nara Lokesh: మరో మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోంది: నారా లోకేశ్

  • తుని నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • శృంగవృక్షంలో కాకినాడ సెజ్ రైతులతో సమావేశం
  • పరిశ్రమలు వస్తే గ్రామాలు బాగుపడతాయన్న లోకేశ్
  • తాము తెచ్చిన పరిశ్రమలను వైసీపీ సర్కారు తరిమేసిందని ఆరోపణ
Lokesh held meeting with Kakinada SEZ farmers

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు తుని నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేశ్ శృంగవృక్షంలో కాకినాడ సెజ్ రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరో మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మళ్లీ పరిశ్రమలను తీసుకువస్తామని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 

టీడీపీ ప్రభుత్వ పాలనలో కియాను తీసుకువచ్చామని, ఈ పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాలు మారిపోయాయని లోకేశ్ చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమ తీసుకువచ్చానని, ఆ పరిశ్రమతో 6 వేల మంది ఉపాధి పొందారని వెల్లడించారు. 

తాము తీసుకువచ్చిన పలు పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందని లోకేశ్ మండిపడ్డారు. పరిశ్రమలు వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, అందుకే రాష్ట్రంలో పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

More Telugu News