Revanth Reddy: కేసీఆర్ కోలుకుంటున్నారు.. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాను: రేవంత్ రెడ్డి

Revanth Reddy wishes KCR to recover soon
  • యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి
  • మంచి పాలన కోసం కేసీఆర్ సూచనలు అవసరమన్న రేవంత్
  • ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందన్న సీఎం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. ఆయనను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ను పరామర్శించానని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. 

కేసీఆర్ ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించానని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో మంచి పాలన అందించడానికి... ఆయన సూచనలు కూడా అవసరం అని అన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్ ను కోరానని తెలిపారు.
Revanth Reddy
Congress
KCR
BRS

More Telugu News