Chandrababu: మిర్చి రైతు శ్రీనివాసరావుకు రూ.2 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు

  • పర్చూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • 6 ఎకరాల్లో మిరప పంట వేసిన రైతు శ్రీనివాసరావు
  • తుపాను కారణంగా పొలంలో నిలిచిన నీరు... కుళ్లిన మిరప మొక్కలు
  • చేసేది లేక పంటను పీకేస్తున్నానని చంద్రబాబుకు చెప్పిన రైతు
  • రైతు బాధ పడడం చూసి చలించిపోయిన చంద్రబాబు
Chandrababu announces Rs 2 lakhs for a farmers who lost crop due to cyclone

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తుపాను కారణంగా దెబ్బతిన్న బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పర్యటించారు. చెరుకూరు గ్రామంలో పంటలపై తుపాను ఏ విధంగా ప్రభావం చూపిందో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

చంద్రబాబు చెరుకూరు గ్రామం మీదుగా వెళుతుండగా... గడ్డం శ్రీనివాసరావు అనే రైతు మిరప పంటను పీకేస్తూ కనిపించాడు. వెంటనే ఆగిన చంద్రబాబు... ఆ రైతును పలకరించారు. 

తాను 6 ఎకరాల్లో మిరపపంట వేశానని, తుపాను రావడంతో పొలంలో నీరు నిలిచిపోయి మిరప మొక్కలు కుళ్లిపోయాయని రైతు శ్రీనివాసరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక చేసేది లేక పంటను పీకేస్తున్నానని వెల్లడించాడు. 

తన పెట్టుబడి, శ్రమ అంతా వృథా అయిందని ఆ రైతు బాధ పడడం చూసి చంద్రబాబు చలించిపోయారు. అప్పటికప్పుడు రైతు శ్రీనివాసరావుకు రూ.2 లక్షల సాయం ప్రకటించారు. ధైర్యంగా ఉండాలని ఆ రైతును ఓదార్చారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, రైతులందరినీ ఆదుకుంటామని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

More Telugu News