Revanth Reddy: నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy gives Rs2 crores to Nikhat Jareen
  • రెండు గ్యారంటీలు ప్రారంభించిన సమయంలో రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేత
  • గత మార్చిలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన జరీన్
  • ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆమెకు ఇది రెండో పతకం 
బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ రోజు రెండు పథకాలను అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించారు. చేయూత, మహాలక్ష్మి పథకాలను లాంచ్ చేశారు. ఈ సమయంలోనే జరీన్‌కు ఆర్థిక సాయం అందించారు. గత మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో 50 కిలోల విభాగంలో జరీన్ స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆమెకు ఇది రెండో బంగారు పతకం.
Revanth Reddy
Congress
sports

More Telugu News