KTR BRSLP: కేసీఆర్ అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నా: కేటీఆర్

Unfortunately I couldnot attend the BRS Legislature meeting today Says KTR
  • బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కూ గైర్హాజరైన ఎమ్మెల్యే
  • మిగతా ఎమ్మెల్యేలతో కలిసి తర్వాత ప్రమాణం చేస్తానంటూ ట్వీట్
  • తండ్రి వద్దే ఉన్న మాజీ మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన లెజిస్లేచర్ మీటింగ్ కు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గైర్హాజరయ్యారు. తెలంగాణ మూడో అసెంబ్లీ సెషన్ కు కూడా వెళ్లలేకపోతున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. యశోద ఆసుపత్రిలో ఆయనకు హిప్ రీప్లేస్ మెంట్ శస్త్రచికిత్స జరిగింది. తన తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నానని, బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కు, అసెంబ్లీకి హాజరు కాలేకపోతున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోతున్నానని కేటీఆర్ చెప్పారు. తనతో పాటు వివిధ కారణాలతో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేని ఎమ్మెల్యేలతో కలిసి మరొక రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు. ఈమేరకు అసెంబ్లీ సెక్రెటరీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
KTR BRSLP
BSRLP Meet
Telangana
Assembly
Oath Taking
Assembly Session
KCR Health

More Telugu News