Allahabad High Court: భార్యకు 18 ఏళ్లు నిండితే వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం: అలహాబాద్ హైకోర్టు

  • ‘అసహజ నేరం’ ఆరోపణల నుంచి భర్తను విముక్తి చేసిన హైకోర్టు
  • వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టు వద్ద పెండింగులో ఉన్నాయ్న కోర్టు
  • వైవాహిక బంధంలో అసహజ నేరం జరిగే అవకాశం లేదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యలను ఉటంకించిన అలహాబాద్ హైకోర్టు
Allahabad High Court Says Marital rape is no offence if wife is 18 or above

భార్యకు 18 ఏళ్లు నిండితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేస్తూ ‘అసహజ నేరం’ కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తను నిర్దోషిగా ప్రకటించింది. నిందితుడిని ఐపీఎల్ సెక్షన్ 377 కింద దోషిగా నిర్ధారించలేమని జస్టిస్ రామ్‌మనోహర్ నారాయణమిశ్రా ధర్మాసనం తేల్చి చెప్పింది. 

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగులో ఉండడం వల్ల, భార్యకు 18 ఏళ్లు, అంతకుమించి ఉంటే వైవాహిక అత్యాచారానికి ఎలాంటి క్రిమినల్ పెనాల్టీ ఉండదని హైకోర్టు పేర్కొంది. వైవాహిక బంధంలో ఎలాంటి ‘అసహజ నేరం’ జరిగే అవకాశం లేదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు గత తీర్పును ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఉటంకించింది.

భర్త తనను దూషిస్తూ శారీరక వేధింపులకు గురిచేయడమే కాకుండా బలవంతం చేశాడని బాధిత మహిళ తన పిటిషన్‌లో ఆరోపించింది. కేసును విచారించిన హైకోర్టు అభియోగాల నుంచి ఆమె భర్తకు విముక్తి కల్పించింది. అయితే, అతడు, అతడి బంధువులు ఆమెతో క్రూరంగా వ్యవహరించడం, గాయపరచడం వంటి అభియోగాల్లో మాత్రం అతడిని దోషిగా నిర్ధారించింది.

More Telugu News