Telangana cabinet: తెలంగాణ కొత్త ఐటీ మినిస్టర్ గా శ్రీధర్ బాబు.. మంత్రులకు శాఖల కేటాయింపు

  • సీఎం రేవంత్ రెడ్డి వద్దే హోం, మున్సిపల్ శాఖలు
  • పంచాయతీ రాజ్, మాతా శిశు సంక్షేమ శాఖ సీతక్కకు..
  • ఆర్థిక శాఖా మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క
Telangana Cabinet department allocation to ministers

తెలంగాణ కేబినెట్ లో కొలువుదీరిన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖ, మున్సిపల్ శాఖలను సీఎం రేవంత్ రెడ్డి తనవద్దే ఉంచుకున్నారు. పదకొండు మంది మంత్రులకు వివిధ శాఖలు అప్పగించారు. రాష్ట్రానికి కొత్త ఐటీ మినిస్టర్ గా మాజీ మంత్రి, సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేశారు.

  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క : ఆర్థిక శాఖ, ఇంధన శాఖ, విద్యుత్ శాఖ
  • సీతక్క : పంచాయతీరాజ్, మాతా శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి
  • దుద్దిళ్ల శ్రీధర్ బాబు : ఐటీ, శాసన సభా వ్యవహారాలు, పరిశ్రమలు
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి : నీటి పారుదల, పౌరసరఫరాలు
  • పొన్నం ప్రభాకర్ రావు : రవాణా శాఖ, బీసీ సంక్షేమం
  • తుమ్మల నాగేశ్వర్ రావు : వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్
  • జూపల్లి కృష్ణారావు : ఎక్సైజ్, పర్యాటక శాఖ
  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి : ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
  • కొండా సురేఖ : అటవీ, పర్యావరణ, దేవాదాయ
  • దామోదర రాజనర్సింహ : వైద్యం, ఆరోగ్య శాఖ
  • పొంగులేటి : రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహనిర్మాణం

More Telugu News