సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా
- స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్
- రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్
- ఈ కేసు వ్యవహారం 17ఏ అంశంతో ముడిపడి ఉందన్న చంద్రబాబు న్యాయవాది
చంద్రబాబుకు ధర్మాసనం గతంలో నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... దీనిపై విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. దాంతో, తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు విన్నవించారు. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.