Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి రెండు సంతకాలు దేనిపై చేశారంటే...!

  • తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం
  • సీఎంగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం
  • దివ్యాంగురాలు రజని నియామక పత్రంపై రెండో సంతకం
Revanth Reddy first two signatures as CM

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆరు గ్యారెంటీల ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజని ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేశారు. 


కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇవే: 
మహాలక్ష్మి పథకం - పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్.
గృహజ్యోతి - ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
రైతు భరోసా - రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్. 
యువ వికాసం - ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. 
చేయూత - రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000.
ఇందిరమ్మ ఇళ్లు - ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

More Telugu News