Revanth Reddy: ప్రత్యేక వాహనంలో వేదిక వద్దకు వచ్చిన సోనియా, రేవంత్.. వేదికపై రేవంత్ కుటుంబం

Sonia and Revanth reaches dias in special vehicle
  • ఎల్బీ స్టేడియంకు చేరుకున్న రేవంత్ కాంగ్రెస్ పెద్దలు
  • కాసేపట్లో రేవంత్ ప్రమాణస్వీకారం
  • రాజ్ భవన్ నుంచి బయల్దేరిన గవర్నర్
కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కాసేపటి క్రితమే ఎల్బీ స్టేడియం వద్దకు రేవంత్ రెడ్డి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య తదితరులు చేరుకున్నారు. ఇక ప్రత్యేక వాహనంలో సోనియాగాంధీ, రేవంత్ రెడ్డి స్టేడియంలోని వేదిక వద్దకు చేరుకున్నారు. రేవంత్ ప్రమాణ స్వీకారం చేసే ప్రధాన వేదికపై రేవంత్ భార్య, కూతురు, అల్లుడు ఆసీనులయ్యారు. మరోవైపు గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ నుంచి స్టేడియంకు బయల్దేరారు.
Revanth Reddy
Sonia Gandhi
Congress

More Telugu News