ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్
- శరవేగంగా సాగుతున్న సీఎం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు
- భద్రతపై ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం
- రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులుగా ప్రమాణం
- కేబినెట్ కూర్పుపై ఇప్పటికే స్పష్టత
ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సీఎస్ శాంతికుమారి సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు, సాధారణ పరిపాలన అధికారులతో చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10:28 గంటలకు ఉంటుందని అధికారులు తొలుత చెప్పారు. అయితే, తర్వాత ఈ ముహూర్తాన్ని మధ్యాహ్నం 1.04 గంటలకు మార్చినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా 9 లేదా 18 మంది ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.
