Srikanth: నిజం చెబుతున్నాను .. ఆ సినిమా తరువాత నా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది: హీరో శ్రీకాంత్

  • 'ఆమె' తరువాత వరుస హిట్లు పడ్డాయన్న శ్రీకాంత్
  • 'మహాత్మ' తరువాత దెబ్బపడిందని వ్యాఖ్య 
  • వరుస ఫ్లాపులు చూడటం జరిగిందని వెల్లడి 
  • కొత్త హీరోలు రావడం కావొచ్చనే అభిప్రాయం 

Srikanth Interview

హీరోగా శ్రీకాంత్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. గట్టి పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని నిలదొక్కుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరో 100 సినిమాలను పూర్తిచేయడం చాలా కష్టమైన విషయం. కానీ శ్రీకాంత్ ఆ సంఖ్యను చాలా తేలికగా దాటేశాడు. రీసెంటుగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. 


'ఆమె' సినిమా తరువాత 'తాజ్ మహల్' .. 'పెళ్లి సందడి' వంటి పెద్ద హిట్లు పడ్డాయి. అప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే, ఆ తరువాత చేయడానికి మూడు సినిమాలు రెడీగా ఉండేవి. హిట్ పడేసరికి పెద్ద బ్యానర్లు వచ్చేవి. అంతకుముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి, ఆ పెద్ద బ్యానర్లు వెనక్కి పోయేవి. అలా జరుగుతూ వచ్చింది. 

'మహాత్మ' తరువాత నాకు పెద్ద దెబ్బపడింది. ఆ సినిమా తరువాత నా కెరియర్ మెల్లగా డౌన్ కావడం మొదలైంది. మంచి సినిమాలే ఒప్పుకుంటూ వచ్చినప్పటికీ, అలా గ్రాఫ్ పడిపోతూ వెళ్లింది. 'మహాత్మ' తరువాత హీరోగా ఓ పాతిక సినిమాలు చేసినా సక్సెస్ మాత్రం దక్కలేదు. కారణం ఏంటనేది తెలియదు ... టైమ్ బాగోలేదనుకున్నాను. కొత్త హీరోలు రావడం అందుకు ఒక కారణం కావొచ్చునేమో" అని చెప్పాడు.

More Telugu News