Prabhas: ప్రభాస్ కథపై కసరత్తు చేస్తున్న హను రాఘవపూడి!

  • ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా హను రాఘవపూడి
  • 'సీతా రామం'తో దక్కిన పెద్ద హిట్
  • వైజయంతీ బ్యానర్లోనే మరో సినిమా  
  • వచ్చే ఏడాదిలో ప్రభాస్ తో సెట్స్ పైకి

 Prabhas in Hanu Raghavapudi movie

ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో హను రాఘవపూడికి ఒక ప్రత్యేకత ఉంది. అందువలన ఆయన అదే జోనర్లో ముందుకు వెళుతున్నాడు. ఆ మధ్య ఆయన నుంచి వచ్చిన 'సీతా రామం' సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ తరువాత సినిమాగా ఆయన చేసేది ప్రేమకథా నేపథ్యంతో కూడినదే .. అది ప్రభాస్ తో కావడమే ఇక్కడి విశేషం.

ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి' .. 'రాజా డీలక్స్' సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన 'స్పిరిట్' సినిమాతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన హను రాఘవపూడితో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ కథపైనే హను రాఘవపూడి కసరత్తు చేస్తున్నాడని తెలుస్తోంది.  

ఒక వైపున రెండో ప్రపంచ యుద్ధం .. మరో వైపున ఆ యుద్ధంతో ముడిపడిన ప్రేమకథగా ఇది సాగుతుందని అంటున్నారు. 'సీతా రామం'ను నిర్మించిన వైజయంతీ మూవీస్ వారే ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆ సినిమాకి పనిచేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడని అంటున్నారు.

More Telugu News