Akhanda 2: 'అఖండ 2' కథపై బోయపాటి కసరత్తు!

  • సంచలన విజయాన్ని అందుకున్న 'అఖండ'
  • సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పిన బోయపాటి
  • అందుకు సంబంధించి జరుగుతున్న సన్నాహాలు 
  • మరో వైపున లైన్లోనే ఉన్న బన్నీ ప్రాజెక్టు

Akhanda 2 Movie Update

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'అఖండ' ... బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మాస్ యాక్షన్ ను లింక్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాను నడిపించడంలో బోయపాటికి మంచి పేరు ఉంది. వాటికి తోడు ఈ కథలో దైవశక్తిని కూడా యాడ్ చేయడం మరింతగా కలిసొచ్చింది. 

ఆ సినిమా తరువాత బోయపాటి చేసిన 'స్కంద' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందువలన ఆయన 'అఖండ 2'కి సంబంధించిన కథను రెడీ చేసుకుంటున్నాడని అంటున్నారు. 'అఖండ'లోని పాయింటును పట్టుకునే సీక్వెల్ కూడా ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని గతంలోనే బోయపాటి చెప్పాడు. 

ఇక ప్రస్తుతం బాలయ్య .. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాతనే ఆయన బోయపాటి ప్రాజెక్టుపైకి వెళ్లవలసి ఉంటుంది. 'అఖండ 2' అనుకున్న సమయానికి మొదలెట్టలేకపోతే, ఆల్రెడీ బన్నీతో ఓకే అనిపించుకున్న కథ రెడీగానే ఉందిగనుక, ఆయనతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూడా బోయపాటి ఉన్నాడని అంటున్నారు. 

More Telugu News