Aarogyasri health cards: ఈ నెల 18 నుంచి 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల జారీ
ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం సీఎం జగన్ అద్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ఆరోగ్యశ్రీ కార్డులు పెద్దమొత్తంలో ఉన్నట్టు తెలిపారు. ఫలితంగా, కార్డుల ముద్రణ కొనసాగుతోందన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమాచారంతో ఇదివరకే బ్రోచర్లు సిద్ధం చేశామని తెలిపారు. అంతేకాకుండా, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు.