Venigandla Ramu: గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ గా వెనిగండ్ల రామును నియమించిన చంద్రబాబు

Venigandla Ramu appointed as Gudivada TDP incharge
  • వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్న రాము
  • పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్న వైనం
  • వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీ చేసే అవకాశం
గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీగా వెనిగండ్ల రామును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా రాము పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. వైద్య శిబిరాలు, అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలను కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు. పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ సమర్థవంతమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాము నియామకంపై పార్టీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై వెనిగండ్ల రాము పోటీ చేసే అవకాశం ఉంది. 

Venigandla Ramu
Gudivada
Telugudesam
Chandrababu

More Telugu News