రోడ్లు ప్రమాద బాధితులకు డబ్బులు లేకుండానే చికిత్స!
- యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- మూడు నాలుగు నెలల్లో అమల్లోకి తీసుకొచ్చే అవకాశం
- ప్రమాదాల్లో గాయపడినవారికి ఉచిత చికిత్స లక్ష్యంగా కేంద్రం అడుగులు
మోటారు వాహనాల సవరణ చట్టం 2019లో భాగంగా దీనిని తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఉచిత వైద్య చికిత్స అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.