Nadendla Manohar: వైసీపీని ఎప్పుడు ఇంటికి పంపాలా అని ప్రజలు వేచి చూస్తున్నారు: నాదెండ్ల మనోహర్

  • జనసేన పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలోనూ భారీ విజయం సాధించాలని ఆకాంక్ష
  • తెనాలిలో క్రియాశీలక వాలంటీర్లతో సమావేశమైన జనసేన కీలక నేత
  • ఎన్నికల సమయంలో ఎలక్షనీరింగ్‌పై అవగాహన కల్పించిన నాదెండ్ల మనోహర్
People are waiting to sent YCP govt to home says Nadendla Manohar

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపించాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని జనసేన అగ్రనేత నాదెండ్ మనోహర్ అన్నారు. జనసేన పోటీ చేసే ప్రతి సీటులో భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెనాలిలో క్రియాశీలక వాలంటీర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

త్రికరణ శుద్ధితో 90 రోజులపాటు పని చేద్దామంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బలంగా ఎలక్షనీరింగ్ చేద్దామని, పోలింగ్ బూత్ వరకు స్ఫూర్తిని తీసుకొద్దామని వాలంటీర్లకు సూచించారు. క్రియాశీల వాలంటీర్ల సేవలు పార్టీకి కొండంత బలమని ప్రశంసించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో జల్లెడ పట్టాలని సూచించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా త్వరలోనే విడుదలవుతుందని, దానిని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షనీరింగ్ చాలా ముఖ్యమని అవగాహన కల్పించారు. తెనాలిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More Telugu News