Lawrence: నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి 'జిగర్తాండ .. డబుల్ ఎక్స్'

  • కార్తీక్ సుబ్బరాజు నుంచి 'జిగర్తాండ డబుల్ ఎక్స్'
  • కథానాయకులుగా లారెన్స్ - ఎస్.జె.సూర్య
  • యాక్షన్ .. ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ 
  • ఈ నెల 8వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో
Jigartanda Double X OTT Release date confirmed

లారెన్స్ - ఎస్.జె. సూర్య ప్రధానమైన పాత్రలను పోషించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్', నవంబర్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులోనూ గట్టిగానే పబ్లిసిటీ చేసి వదిలారు. 

సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 8వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కథా పరంగా చూసుకుంటే, మాస్ యాక్షన్ .. ఎమోషన్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. 

సీజర్ - దాసన్ అనే రెండు ప్రధానమైన పాత్రల మధ్య ఈ కథ కొనసాగుతుంది. సీజర్ ఓ రౌడీ .. ఓ రాజకీయనాయకుడి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న దాసన్, కొన్ని కారణాల వలన సీజర్ ను చంపడానికి రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత ఏ జరుగుతుందనే మలుపులతో ఈ కథ నడుస్తుంది.

More Telugu News