Vijayasai Reddy: యువ ఓటర్లు మొదటి ఓటు చంద్రబాబుకు వేయాలట: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy fires on Chandrababu
  • నేడు కూకట్ పల్లిలో యువ ఓటర్ల కోసం సీబీఎన్ ఫోరం కార్యక్రమం
  • కుట్రలకు పాల్పడటం చంద్రబాబు నైజం అన్న విజయసాయిరెడ్డి
  • వివిధ కేసుల్లో నిందితుడైన బాబును భుజాలపై మోయాలట అని విమర్శ
యువ ఓటర్ల కోసం కూకట్ పల్లిలోని ఒక ఫంక్షన్ హాల్ లో సీబీఎన్ ఫోరం ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారి గుణమే స్ట్రాటెజీల పేరుతో కుట్రలకు పాల్పడటం అని ఆయన అన్నారు. యువ ఓటర్లు మొదటి ఓటు చంద్రబాబుకే వేయాలట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సామాజికవర్గం వారు కూకట్ పల్లిలో ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నారని... దీని ఉద్దేశం కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని వివిధ కేసుల్లో నిందితుడైన బాబు గారిని భుజాలపై మోయాలట అంటూ దుయ్యబట్టారు.

More Telugu News

Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam