KTR: కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ అభినందనలు.. ఓటమిని అంగీకరించిన మంత్రి

Congratulations to Congress party on winning the mandate
  • రెండుసార్లు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు
  • ఓటమి నుంచి నేర్చుకొని తిరిగి పుంజుకుంటామని ధీమా
  • హ్యాట్రిక్ సాధిస్తామన్న తమ గురి తప్పిందన్న కేటీఆర్
  • సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఘన విజయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీ రామారావు అభినందనలు తెలిపారు. మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేటీఆర్ ఓటమిని అంగీకరించారు. తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ రోజు వచ్చిన ఫలితాలపై తాము బాధపడలేదని, కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని పేర్కొన్నారు. అయితే ఈ ఓటమిని నుంచి తాము నేర్చుకుంటామని, తిరిగి బలంగా పుంజుకుంటామని వ్యాఖ్యానించారు. హ్యాట్రిక్ సాధిస్తామన్న తమ గురి తప్పిందంటూ మరో ట్వీట్ చేశారు. దీనికి వయస్సు అయిపోదు... గురి తప్పింది అంతే అన్నారు.

సిరిసిల్ల నుంచి కేటీఆర్ గెలుపు

మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్ రావు గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, మధిర నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క గెలుపొందారు.

  • Loading...

More Telugu News