కామారెడ్డిలో ముందంజలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి... రెండో స్థానంలో రేవంత్, మూడోస్థానంలో కేసీఆర్
- 13 రౌండ్ల వరకు 625 ఓట్ల ముందంజలో రేవంత్ రెడ్డి
- 14వ రౌండ్ పూర్తయ్యేసరికి 2,100 ఓట్ల మెజార్టీతో కాటిపల్లి
- సీఎం, టీపీసీసీ చీఫ్ పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి కామారెడ్డి పైనే..!
ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో నిలవడంతో అందరి దృష్టి ఈ సీటుపై ఉంది. ఇక్కడి నుంచి ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో విజయం సాధిస్తారనే వాదన మొదటి నుంచి ఉంది. అందుకు తగినట్లుగా కేసీఆర్ దాదాపు ఏ దశలోనూ ఇక్కడ ముందంజలో కనిపించలేదు. మొదటి పదమూడు రౌండ్లు రేవంత్ లీడ్‌లో నిలిచారు. కానీ పద్నాలుగో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 2,100 ఓట్ల ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో రేవంత్ రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ ఉన్నారు.