Results: తొలి రౌండ్ లో కాంగ్రెస్ హవా..

  • ములుగులో సీతక్క 3,500 ఓట్లతో లీడ్
  • హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆధిక్యం
  • సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజ
  • మధిరలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క లీడ్
Telanagana Assembly Election Results

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ములుగులో సీతక్క 3,500 ఓట్లతో ముందంజలో ఉండగా.. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్, సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు తమ ప్రత్యర్థుల కన్నా ముందున్నారు. మానకొండూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ ముగిసే సరికి 3,743 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉండగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి (2,738 ఓట్లు), మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి (1,370 ఓట్లు) నిలిచారు.

ఎవరరెవరు.. ఎక్కడెక్కడ లీడ్ లో ఉన్నారంటే..

  • స్టేషన్ ఘన్ పూర్: కడియం శ్రీహరి (బీఆర్ఎస్)
  • మానకొండూర్: కవ్వంపెల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)
  • నిజామాబాద్ రూరల్: భూపతి రెడ్డి (కాంగ్రెస్)
  • హుజూర్ నగర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 వేల ఓట్ల ఆధిక్యం
  • కామారెడ్డి, కొడంగల్: రేవంత్ రెడ్డి
  • హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్
  • సనత్ నగర్: తలసాని శ్రీనివాస్ యాదవ్ 
  • నాగార్జున సాగర్: జయవీర్ (కాంగ్రెస్)
  • హుజూరాబాద్: ఈటల రాజేందర్
  • భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
  • మధిర: భట్టి విక్రమార్క (కాంగ్రెస్)
శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, ముషీరాబాద్ లలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు.
నిజామాబాద్ అర్బన్, నల్గొండ, ఇల్లందు మిర్యాలగూడ, ఆలేరులలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
మంచిర్యాల, బెల్లంపల్లిలలో బీజేపీ అభ్యర్థులు దూసుకెళుతున్నారు.

More Telugu News