Revanth Reddy: కామారెడ్డిలో కాంగ్రెస్‌దే ఆధిక్యం.. తొలి రౌండ్‌లో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ముందంజ

  • పోస్టల్ బ్యాలెట్‌‌తోపాటు ఈవీఎం ఓట్లలోనూ కొనసాగుతున్న కాంగ్రెస్ దూకుడు
  • నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మొత్తం స్థానాల్లో ఆధిక్యం
  • కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌దే పైచేయి
  • ఖైరతాబాద్‌లో విజయారెడ్డి ఆధిక్యం
Revanth Reddy Leads In Kamareddy Over KCR

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాగా కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. కొడంగల్‌తోపాటు కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీకి దిగిన రేవంత్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో ఆయనకే ఆధిక్యం లభించింది. అంతకుముందు పోస్టల్ బ్యాలెట్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి ఆధిక్యం కనబర్చారు. ఇక ఉమ్మడి నిజామాబాద్‌లోని ఐదు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ దూసుకెళ్తోంది.


ఖైరతాబాద్‌లో విజయారెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిక్యంలో ఉండగా, బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అర్బన్, బోధన్‌లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో తొమ్మిదింటిలో కాంగ్రెస్, ఒకదాంట్లో సీపీఐ ఆధిక్యంలో ఉంది. గోషామహల్‌లో రాజాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు.

More Telugu News