Nimmagadda Ramesh Kumar: ఉద్యోగం కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసేయడం సరికాదు: నిమ్మగడ్డ

  • గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన
  • ఫారం-7 బాధితులతో కలిసి నిరసన ప్రదర్శన
  • అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ
Nimmagadda participates protest in Duggirala

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పర్యటించారు. ఓట్ల జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఎలుగెత్తారు. ఫారం-7 బాధితులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మన ఓటు మన హక్కు అంటూ ఫారం-7 బాధితులతో కలిసి నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఓటు హక్కుకు విఘాతం కలిగించేలా ఫారం-7 దరఖాస్తులు వస్తున్నాయని వెల్లడించారు. సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరికీ ఉంటుందని, ఉద్యోగం కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసేయడం సరికాదని అన్నారు. 

గంపగుత్తగా ఫారం-7 దరఖాస్తులు అప్ లోడ్ చేసేవారిపై నియంత్రణ ఉండాలని నిమ్మగడ్డ సూచించారు. దుగ్గిరాలలో 23 మంది స్థానికుల ఓట్లకు ఫారం-7 పెట్టారని ఆరోపించారు. ఫారం-7 దరఖాస్తులపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశానని తెలిపారు.

More Telugu News